Header Banner

భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు! మంత్రివర్గం ఆమోదం!

  Fri Mar 07, 2025 11:06        Devotional

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది. ఆలయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గంకు నోట్ రూపంలో అందించారు. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాప్టర్ 14 కింద ఈ దేవస్థానాన్ని చేర్చారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టసవరణ చేయనున్నారని సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని, లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని మంత్రివర్గానికి సమర్పించిన నోట్‌లో పేర్కొన్నారు. బోర్డుకు చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉంటారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YadadriBhuvanagiriDistrict #Telangana #TTD